ఢిల్లీలో ఎన్నికలకు ఆప్ సిద్దం
posted on May 21, 2014 @ 1:03PM
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోవడం వల్ల మరోసారి ప్రజల ముందుకు వెల్లుతున్నామని ఆమ్ఆద్మీపార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రజల్లో ఆప్‌పై ఆదరణ తగ్గలేదని అన్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నామని అందువల్ల ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజాభిప్రాయం కోరాలని భావించామన్నారు. అయితే నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టగానే. ఢిల్లీలో శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తే, బీజేపీయే విజయం సాధించే అవకాశాలు ఎక్కువుంటాయి గనుక బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ తప్పనిసరిగా తనకే మద్దతు ఇస్తుందనే ధీమాతో కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ని నిన్న కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా తనకే మరో అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించిడంతో ఏమిచేయాలో పాలుపోక మళ్ళీ ఎన్నికలకు సిద్దమవుతున్నారు.