'ఫ్రీడమ్ 251' వచ్చేస్తుందోచ్...
posted on Jul 9, 2016 @ 2:57PM
'ఫ్రీడమ్ 251' ఈస్మార్ట్ ఫోన్ పేరు మాత్రం అందరూ వినే ఉంటారు. అతి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందంటూ ఎంత ఫేమస్ అయిందో.. పలు వివాదాల్లో చుట్టుకొని అంతకంటే ఫేమస్ అయింది. రింగింగ్ బెల్స్ అనే కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నా.. ఈ కంపెనీ మాత్రం వాటన్నింటిని అధిగమించి ఎట్టకేలకు ఫోన్లను డెలివరీ చేయడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఓ ప్రకటన కూడా చేసింది. ఈరోజు నుండి డెలివరీ ప్రారంభంకానుందని.. తొలివిడతలో ముందుగా 2,240 ఫోన్లను డెలివరీ చేయనున్నట్టు తెలిపారు. అయితే మొదటగా నాలుగు రాష్ట్రాల్లో (హిమాచల్ ప్రదేశ్, బీహార్, హర్యానా, ఉత్తరాఖాండ్) మాత్రమే ఈ ఫోన్లను అందించనున్నారు. అయితే ఫోన్ ధర 251 రూపాయలు కాగా.. షిప్పింగ్ ఛార్జీలు 40 రూపాయలు కలిపి మొత్తం 291 రూపాయలు చెల్లించాలన్నమాట. మరి అతి తక్కువ ధరకే వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఎంత స్మార్ట్ గా పనిచేస్తుందో చూద్దాం.