మరోసారి తెరపైకి వచ్చిన ఫ్రీడమ్ 251 .. జూన్ 28 నుండి డెలివరీ
posted on Jun 14, 2016 @ 5:28PM
ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్.. ఇది గుర్తుండే ఉంటుంది కదా.. రూ. 251 కే స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామని రింగింగ్ బెల్స్ సంస్థ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఈ హడావుడికి తగ్గట్టే విమర్శలు కూడా బాగానే వచ్చాయి. అయితే గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు మరో వార్తతో బయటకు వచ్చింది. జూన్ 28వ తేదీ నుంచి తమ ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లను అందిస్తామని కంపెనీ డైరెక్టర్ మొహిత్ గోయల్ ప్రకటించారు. తమ ఫ్రీడం ఫోన్ల కోసం దాదాపు ఏడు కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, 30వేలమంది కాఫ్ ఆన్ డెలివరీ కింద తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. కాగా గత ఫిబ్రవరిలో చేసిన సంస్థ ప్రకటనతో ముప్పై వేల మందికి పైగా ఫ్రీడమ్ 251 ఫోన్లను బుక్ చేశారు. మరో ఏడు కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో.. ఇది ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.