బండికి 14 రోజుల రిమాండ్.. ఖమ్మం జైలుకు తరలింపు
posted on Apr 6, 2023 6:52AM
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు పోలీసులు అరెస్టు చేసి వరంగల్ సీపీ రంగనాథ్ ధృవీకరించారు. పేపర్ లీకేజీ కంటే ముందే బండి సంజయ్ తో నిందితుడు ప్రశాంత్ చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బండి సంజయ్ తో ప్రశాంత్ వందకు పైగా కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు క్లారిటీకి వచ్చారు. తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ ను వరంగల్ సీపీ రంగనాథ్ ధృవీకరించారు.
10 వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత ప్రచారాల్లో బండి సంజయ్ హస్తం ఉందని అన్నారు. బండిపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 420, 120B, సెక్షన్ 5 ఆఫ్ మాల్ ప్రాక్టీస్, సీఆర్పీసీ 154, 157 కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా బండి సంజయ్ ను హనుమకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరు పరిచారు. ఆయన బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు బండి సంజయ్ ను ఖమ్మం జైలుకు తరలించారు. కాగా బండి సంజయ్ పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరును బీజేపీ లీగల్ సెల్ ప్రతినిథులకు వివరించారు. పోలీసులు దురుసుగా వ్యవహరించి తనకు గాయపరిచారని చెబుతూ చొక్కా విప్పి లాయర్లకు గాయాలను చూపారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.