మాజీ ఎంపీ హర్షకుమార్ కు కరోనా పాజిటివ్
posted on Aug 17, 2020 @ 3:31PM
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు కూడా పెద్ద సంఖ్యలోనే కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు కరోనా బారిన పడగా.. తాజాగా తూర్పు గోదావరి జిల్లాకి చెందిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన ఇటీవల టెస్టు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. హర్ష కుమార్‌తో పాటు ఆయన ఇద్దరు కోడళ్లకు, మనవరాలికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది.
కాగా, ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,829కి చేరింది. ఇప్పటివరకు 2,01,234 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 85,945 యాక్టివ్ కేసులున్నాయి.