తాడేపల్లి ప్యాలెస్‌లో మీ అధినేతను ఓదార్చు...రోజాకు భాను ప్రకాష్ కౌంటర్
posted on Aug 15, 2025 @ 12:57PM
గత అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల పరిధిలో వైసీపీకీ 64% ఓట్లు సాధించిందని ఇప్పుడు 8.95% ఓట్లు రావడమేంటని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 24% ఓట్లు వచ్చిన టీడీపీకీ ఇప్పుడు 88% ఓట్లు రావడమేంటని మండిపడ్డారు. ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులకు 0,1,2,3, 4 ఓట్లు రావడం ఏమిటో పోటీలో ఉన్న అభ్యర్థికి వారి కుటుంబసభ్యులు అయినా ఓటు వేయరా? ఈ ఫలితాలను మనం నమ్మాలా అంటూ ఆమె సందేహం వ్యక్తం చేశారు.
రోజా కామెంట్స్‌పై చిత్తురు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని పేర్కొన్నారు.పిచ్చి ప్రేలాపనలు పక్కన పెట్టి..నేటి నుండి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం..నగరి నుండి ఉచితంగా విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ వరకు బస్సులో ప్రయాణించి మీ అధినేత జగన్‌ను ఓదార్చు అని రోజాకు ఎమ్మెల్యే భాను ప్రకాష్ సలహా ఇచ్చారు.