కాళ్లను బలంగా ఉంచుకోవాలంటే.. ఇవి తినాల్సిందే..!



శరీర బరువు మొత్తం కాళ్లే మోస్తాయి.  ఎండలో నడవడం, వానలో తడవడం.. క్లిష్టమైన దారిలో వెళ్లడం చేసినప్పుడు కాళ్లే మొదట బాధితులుగా మారతాయి. ఇక పరిగెత్తడం, వేగంగా నడవడం,   రోజువారి కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనడం మొదలైన వాటికి కాళ్లు ఆరోగ్యంగా ఉండాలి.  కాళ్లు బలహీనంగా ఉన్నా, కాళ్ల ఎముకలు,  కండరాలు బలహీనంగా ఉన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు,  కండరాల నొప్పులు, ఎముకలు బలహీన పడటం వంటి సమస్యలు ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాళ్లు బలంగా ఉండటానికి ఆహారం బాగా సహాయపడుతుంది.   ఏ ఆహారాలు తింటే కాళ్లు బలంగా ఉంటాయో తెలుసుకుంటే..

పాలకూర, బచ్చలికూర..

పాలకూర, బచ్చలికూరలో ఐరన్, కాల్షియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి.  ఇవి కండరాలకు మేలు చేస్తాయి.  శరీరానికి చాలా శక్తిని అందిస్తాయి.  ఆహారంలో బచ్చలికూర, పాలకూరను విరివిగా తీసుకుంటే కాళ్లు బలంగా ఉంటాయి.

సాల్మన్ ఫిష్..

సాల్మన్ ఫిష్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి కండరాల పునరుద్దరణలో సహాయపడతాయి.  కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా సహాయపడతాయి. ఎముకలను బలంగా మార్చి కాళ్లు బలంగా ఉండేందుకు  సాల్మన్ ఫిష్ తీసుకోవాలి.

చిలకడదుంపలు..

చిలకడదుంపలలో సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి.  ఇవి శరీరానికి శక్తి అందించడంతో పాటు ఎక్కువ సేపు ఆ శక్తిని నిలిపి ఉంచుతాయి. చిలకడదుంపలను ఆహారంలో రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఎంతో మంచిది.

కోడిగుడ్లు..

ప్రోటీన్,  ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు పుష్కంలగా ఉండే ఆహారంల గుడ్లు కూడా  ఒకటి.  ఇవి కండరాల పెరుగుదలకు సహాయపడతాయి.  కండరాల మరమ్మత్తుకు కూడా సహాయపడతాయి. రోజుకు ఒక గుడ్డు తింటూ ఉంటే  కాళ్ల కండరాలు చాలా తొందరగా గట్టి పడతాయి.  బలంగా మారతాయి.

బాదం..

బాదంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు,  విటమిన్-ఇ ఉంటాయి.  ఇవి కండరాలను బలంగా మారుస్తాయి.  కండరాల ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.  కాళ్లు బలంగా ఉండటంలో సహాయపడతాయి.

క్వినోవా..

క్వినోవాలో అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.  ఇది చాలా గొప్ప ప్రోటీన్ మూలం ఉన్న ఆహారం.  కండరాల బలాన్ని పెంచడానికి, కండరాలు తొందరగా కోలుకోవడానికి క్వినోవా బాగా సహాయపడుతుంది.


                                                *రూపశ్రీ.