లాక్ డౌన్ సమయంలో ప్రయాణం చేయలేని విమాన ప్రయాణికులకు శుభవార్త
posted on Sep 7, 2020 @ 10:58AM
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో విమాన సర్వీసులన్నీ రద్దు చేశారు. మార్చి 25 నుంచి మే 3 మధ్య దేశీయ, విదేశీయ విమాన ప్రయాణాల కోసం ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు శుభవార్త చెప్తున్నాయి విమానయాస సంస్థలు. ప్రయాణీకులు బుక్ చేసుకున్న టికెట్ మొత్తాన్ని పూర్తిగా రిఫండ్ ఇస్తామంటున్నారు. వచ్చే ఏడాది అంటే 2021 మార్చి 31లోగా అదే టిక్కెట్ పై ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తారు.
లాక్ డౌన్ సమయంలో ప్రయాణం చేయలేనివారి తరపున ప్రవాసీ లీగర్ సెల్ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ విషయంపై సమాధానం చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. లాక్ డౌన్ సమయంలో టిక్కెట్ బుక్ చేసుకున్నవారికి విమానయాన సంస్థలు కనుక రిఫండ్ ఇవ్వకుంటే వచ్చే ఏడాది మార్చి 31 వరకు అదే టికెట్‌పై మరోమారు ప్రయాణించే అవకాశం (క్రెడిట్ షెల్) లభిస్తుందని కేంద్రం వివరించింది. క్రెడిట్ షెల్ వినియోగించుకోని ప్రయాణికులకు పూర్తిస్థాయి రిఫండ్ ఇస్తుందని అత్యున్నత ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. విమాన ప్రయాణికులు తమ టికెట్‌ను వేరేవారికి బదిలీ చేసే అవకాశం కూడా ఉంటుందని పేర్కొంది. దీంతో కరోనా సమయంలో ప్రయాణం చేయలేకపోయిన వారికి కాస్త ఊరట కలిగింది.