వరదల్లో చనిపోయిన వారికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా: రేవంత్ రెడ్డి
posted on Sep 2, 2024 @ 2:43PM
తెలంగాణలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. అనేక మంది మృత్యువాతపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్ష సూచన రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ అప్రమత్తం చేసుకోవాలని రేవంత్ సూచన చేశారు. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరద పోటెత్తింది. అనేక మంది మృత్యువాతపడ్డారు. వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రాన్ని సాయం కోరాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. జరిగిన నస్టంపై అంచనా వేసి నివేదిక ఇవ్వాలని రేవంత్ సిఎం అధికారులకు హుకుం జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కింద రూ. 5 కోట్లు విడుదల చేస్తూ రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.