రాజస్థాన్ లో కాల్పులు.. రెండ్రోజులు ఇంటర్నెట్ బంద్!
posted on Nov 25, 2022 @ 9:40AM
రాజస్థాన్ లో జరిగిన కాల్పుల ఘటన కారణంగా రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఇంటర్నెట్ బంద్ చేశారు. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ లోని బిల్వారా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మరణించారు.
గతంలో ఈ ప్రాంతంలో ఆదర్శ తపాడియా అనే వ్యక్తి హత్య జరిగింది. ఆ హత్యకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాగా నలుగురు వ్యక్తులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపి పరారయ్యారంటున్నారు. కాగా ఈ కాల్పుల్లో మరణించిన వ్యక్తి ముస్లిం కావడంతో మత ఘర్షణలు పెచ్చరిల్లే అవకాశం ఉందని భావించిన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా బిల్వారా ప్రాంతంలో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించారు.
ఈ ఏడాది మే నెలలో తపాడియా అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆ సందర్బంగా ఈ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు నాటి హత్యకు ప్రతీకారంగానే ఈ కాల్పుల ఘటన జరిగిందని భావిస్తున్న నేపథ్యంలో అధికారులు ముదు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ప్రాంతమంతా పోలీసుల పహారాలో ఉంది. కాల్పులు జరిపి పరారైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.