మిచిగాన్ స్టేట్ వర్సిటీలో కాల్పులు.. ముగ్గురు మృతి
posted on Feb 14, 2023 @ 10:05AM
అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో కనీసం ముగ్గురు విద్యార్థులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వర్సిటీలోని రెండు ప్రాంతాలలో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మక వర్సిటీలలో మిచిగాన్ స్టేట్ వర్సిటీ ఒకటి. ఈ యూనివర్శిటీలో ఎక్కువగా భారత విద్యార్థులు, అందులోనూ తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య ఎక్కువ. ఈ క్యాంపస్ లో 50 వేల మంది విద్యార్థులు ఉన్నారు.
ఇలా ఉండగా వర్సిటీ క్యాంపస్‌లోని బెర్కీ హాల్‌లోనూ, సమాచారం వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. అనేక మంది బాధితుల్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మరో బిల్డింగ్ వద్ద కూడా కాల్పుల శబ్ధాలు వినిపించాయి. ఈ ఘటన తర్వాత దుండగుడు ఆ ప్రాంతం నుంచి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో చిక్కినట్లు పోలీసులు చెప్పారు. ఆ తరువాత కాల్పులకు తెగబడిన వ్యక్తి పోలీసు కాల్పులలో హతమయ్యాడని పేర్కొన్నారు.