ఎడ్లబండ్లే బెటరా?
posted on Aug 15, 2012 8:19AM
గతంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో మంటలు... ప్రయాణీకుల మరణం దుర్ఘటనను మరచిపోకముందే.. సోమవారం మధ్యాహ్నం త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్ ఎస్`7 బోగీ కింద మంటలు రావడం... ప్రయాణీకులు తీవ్ర భయంతో చైన్ లాగటం.. తమ్మిలేరు వాగుపై నున్న బ్రిడ్జిపై రైలు ఆగటం.. ప్రయాణీకులు ప్రాణభయంతో వాగులోకి దూకడంతో పలువురు తీవ్రంగా గాయపడటం జరిగింది. ప్రతిరోజు ఎక్కడోచోట రైలు ప్రమాదం, బస్సుప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. ప్రయాణమంటేనే భయపడుతున్న ప్రయాణికులు ఈ ప్రమాదాల నేపథ్యంలో.. పోను పోను పూర్వంలాగా ఎడ్లబండ్లు, గుర్రపుబండ్లే శ్రేయస్కరమని భావించినా ఆశ్చర్యపోనక్కరలేదు. సంబంధిత బాధితులకు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నా స్పందన లేనట్లుగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు, మంత్రులు ఇకనైనా బాధ్యతగా వ్యవహరించకపోతే ‘రవాణాసౌకర్యాలు ప్రమాదాలకు నిలయాలు, మరణానికి రహదారులు’ అన్న వ్యంగ్యోక్తి అక్షరసత్యంగా నిలుస్తుంది. అరవై అయిదేళ్ళ స్వతంత్రభారతంలో ప్రజల భద్రతకోసం ఇప్పటికైనా శ్రద్ధ పెట్టాల్సిఉంది మరి!