కవిత, రేవంత్ లపై ఎఫ్ఐఆర్
posted on Nov 30, 2023 @ 1:11PM
పోలింగ్ బూత్ వెలుపల ప్రచారం చేయడంతో ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు అందినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. దీనిపై డీఈవోకు నివేదించామని ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్లు చెప్పారు. మరిన్ని చోట్ల ఫిర్యాదులు అందాయని తెలిపారు.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఫిర్యాదు వస్తే ఎఫ్ఐఆర్ నమోదయిందన్నారు. ఆయన పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న రేవంత్ ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు బిఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మరికొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయని, ఆయా డీఈవోలకు పంపించామని, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని.. రెండు, మూడు చోట్ల ఈవీఎంలు మార్చామని చెప్పారు. ఓటరు కార్డు లేకపోతే 12 ప్రత్యామ్నాయ కార్డులకు గుర్తింపు ఉందన్నారు.
తెలంగాణలో పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ... సమస్య రావడంతో ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు మార్చడం జరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కానీ పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మరింతగా పెరగవలసి ఉందన్నారు. ఎపిక్ కార్డు లేకపోతే 12 ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు ఉన్నాయని, వాటిని గుర్తింపు కార్డులుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని సూచించారు.