సోంపు నీళ్లు తాగితే కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసా?
posted on Nov 16, 2024 @ 9:30AM
సొంపు లేదా సోపు చాలా మందికి తెలిసిన పదార్థమే. ఇవి జీలకర్రను పోలిన గింజలు. తరచుగా రెస్టారెంట్లు, హోటళ్లలో భోజనం తరువాత వీటిని ఇస్తుంటారు. భారీ భోజనం తరువాత సొంపు తింటే ఆహారం బాగా జీర్ణమై కడుపు బరువు తగ్గుతుందని అంటారు. పైగా ఇది గొప్ప మౌత్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తుంది. అందుకే చాలామంది భోజనం తరువాత సొంపు తింటారు. చాలామందికి సొంపు గింజలను ఇలా తినడమే తెలుసు. కానీ సొంపు గింజలను కాకుండా సొంపు గింజల నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు.
జీర్ణక్రియ..
సొంపు గింజల నీరు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణాన్ని, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.
బరువు..
బరువు తగ్గడంలో సొంపు నీరు బాగా పనిచేస్తాయి. సొంపు గింజలలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇక సొంపు నీటిలో సమ్మేళనాలు శరీరంలో ఉండే కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి. ఈ కారణంగా ఇది బరువు తగ్గిస్తుంది. పదే పదే ఆహారం తినాలనే కోరికను కంట్రోల్ చేస్తుంది. పరగడుపునే సొంపు నీరు తాగడం చాలామంచిది.
యాంటీ ఆక్సిడెంట్లు..
సొంపు నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ నుండి శరీర కాణాలను కాపాడటంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు యవ్వనంగా కనిపించడంలోనూ, అనేకరకాల వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
క్యాన్సర్ ముప్పు తగ్గిస్తుంది..
సొంపులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. సొంపు నీటిని తాగుతూ ఉంటే శరీరంలో క్యాన్సర్ కణాల అభివృద్దిని అడ్డుకుంటుంది. క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.
*నిశ్శబ్ద.