ఫేస్ బుక్ కొత్త యాప్ రిఫ్
posted on Apr 2, 2015 @ 2:58PM
సోషల్ నెట్ వర్కింగ్ లో ఫేస్బుక్ చాలా ప్రాచుర్యం పొందిందని మనకు తెలుసు. ఇప్పుడు ఈ ఫేస్ బుక్ రిఫ్ అనే మరో కొత్త యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐవోఎస్ ఫోన్లకు సపోర్ట్ చేసేలా దీనిని ప్రారంభించింది. 20 సెకన్ల నిడివిలో ఒక వీడియోను రికార్డు చేసి అవతలి వ్యక్తికి పంపించవచ్చు. కొద్ది నిడివి ఉన్న వీడియోలను రికార్టు చేసేందుకు ఈ రిఫ్ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ రిఫ్ ప్రొడక్ట్ మేనేజర్ జోష్ మిల్లర్ తెలిపారు. ఫేస్బుక్ ద్వారా కానీ, మరే విధంగానైనా కానీ వీటిని పంచుకోవచ్చని చెప్పారు. ఈ రిఫ్ యాప్ రూపొందించడానికి ఈ మధ్య కాలంలో ఎక్కువ వార్తల్లో కనిపించిన ఐస్ బకెట్ తో స్నానం చేసిన వీడియోల ప్రోత్సాహమే అని జోష్ మిల్లర్ అన్నారు.
రిఫ్ యాప్ ప్రత్యేకతలు:
* రిఫ్ ద్వారా వీడియోలు మాత్రమే రికార్డు చేయగలము. కొత్తవి అప్లోడ్ చేయడం సాధ్యం కాదు.
* వీడియో రికార్డింగ్ స్టార్ట్ అవగానే 3-2-1 అంటూ కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది.
* దీనికి పోస్టింగ్ ముందు ధ్రువీకరించుకునే అవకాశం మాత్రం ఉంది.
* ఒకేసారి పలు వీడియోలను రికార్డు చేసే అవకాశంగానీ, ఎడిట్ చేసే అవకాశంగానీ లేదు.
* కామెంట్పం పిండం, లైక్ కొట్టడం సాధ్యం కాదు.
* వీడియో వచ్చిన తరువాత దానికి బదులుగా మరో వీడియోను షూట్ చేసి మాత్రమే పంపించేందుకు అవకాశం ఉంది.