Read more!

మన కంటిని బట్టి మన ఆరోగ్యం తెలుసుకోవచ్చు...

సర్వేంద్రియానాం నయనం ప్రాధానం అంటే మనకు కళ్ళే కీలకం సమస్త సృష్టిని చూసేది మన కళ్ళే. మనకంటికి కనపడిన వెంటనే మనసు స్పందిస్తుంది. అయితే కళ్ళు ఉండీ నిజాన్ని చూడలేని వాళ్ళ కన్నా. కళ్ళు లేనువాళ్ళే స్పందించే తీరు జీవితం లో వేరుగా ఉంటుంది. వారి జీవితం సవాళ్లతో కూడుకుని ఉంటుంది.సవాళ్ళను అధిగమిస్తూ మేము ఎవరికీ తీసిపోము అన్నట్లుగా తమ జీవితాన్ని పలువురికి ఆదర్శ ప్రాయంగా ఉంటారు అంధులు అయితే అయితే కళ్ళను చూసి మనకు ఉన్న వ్యాధులను గుర్తించ వచ్చని నిపుణులు పేర్కొన్నారు.కంటిద్వారా మనకు ఉన్న వ్య్సధులను ఖచ్చితంగా అంచనా వేయవచ్చని. అవికూడా ప్రస్తుతం ఉన్న వ్యాధులను. భవిష్యత్తులో వచ్చే వ్యాధులను కూడా గుర్తించవచ్చని. ఇది భారతీయులు ముఖ్యంగా మన పూర్వీకులు మనకు ఇచ్చిన నాడీ వైద్యం లో ప్రస్తావించారని పెర్కిన్నారు.మన కళ్ళను బట్టి మన అనారోగ్య సమస్యను గుర్తించవచ్చు. చలామంది హెల్త్ చెకప్ పేరుతో ఆరోగ్యం పై హెల్త్ చెకప్ అందరూ చేయించు కోలేరు.అయితే వారి వారి కళ్ళను చూసి వారి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం సాధ్యమని అంటున్నారు ప్రముఖ నాడీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణం రాజు.

మీకళ్ళు నిప్పుకనాళ మాదిరిగా ఎర్రగా ఉన్నాయా...

కొందరి కళ్ళు నిప్పుకనాళ లాగా ఎర్రగా ఉంటాయి. వైద్యుడు పరీక్షించి చూస్తే రెటీనా పైన చిన్న చిన్న రక్తకణాలు కనబడతాయి.దీనికి కారణం అధిక రక్త పోటు అధిక రక్త పోటు కారణంగా కంటిలోని నరాలు ఎర్రగా మారుతాయి. కొన్ని సార్లు అవి పగిలిపోవడం కూడా జరగ వచ్చు. దాంతో కళ్ళు ఎర్రగా కనబడతాయి. అయితే ఈ విషయం నాలుగో వంతు మందికి తెలియదు. ఇలాంటి సమస్య ఉన్నవారు గుండె పోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువేఅని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కళ్ళు ఎర్రబడితే ఆ ఏం జరుగుతుంది లె అని వదిలి వేయకండి ఇది హై బిపి కార్డియోక్ ఇండికేషన్ అని జాగ్రత పడాలి అని అంటున్నారు నిపుణులు.

కళ్ళు తెల్లగా పాలిపోయి నట్లు ఉంటె..

దీనిని ఎనిమియా సమస్యగా పేర్కొన్నారు.అంటే రక్త హీనత అని చెప్పవచ్చు. ఇది మీ అనారోగ్య సమస్యగా చెప్పవచ్చు.శరీరంలో సరైన పోషకాలు లేనండువల్లె శరీరంలో రక్త హీనత వస్తుందని ఒక్కోసారి రక్త హీనత మరిన్ని సమస్యలకు దారితీయ వచ్చు.

కళ్ళు ఎర్రగా రక్తం కారినట్లు ఉంటె..

ఒక్కొకరిలో కళ్ళలో రక్తం కారినట్లు ఉంటాయి. రక్తంలో ప్లేటి లెట్స్ తగ్గడం వల్ల ఇలా కనిపిస్తుంది.

కను గుడ్డు పోటు రావడం..

శరీరంలో డీ హైడ్రేషన్ వల్ల లేదా మెడ నరాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కనుగుడ్డు ముందుకు వస్తుంది.

కంటి రెప్పల పై ఉండే హెయిర్ ఊడిపోవడం..

కనురెప్పల పైన ఉండే జుట్టు ఊడి పోవడం అంటే ఇది క్యాన్సర్ కు ఇండికేషన్ గా చెప్పవచ్చు.కనురెప్పలు ఒక్కోసారి డ్రై కావడం--కంటి నుండి ఎక్కువనీరుకారడం. సైనస్ లేదా నోజేల్ సూబ్ బ్లాక్స్ ఉండడం. ఈ కారణంగా సైనస్ సమస్యలు ఉంటె ఇలాంటి సమస్యలు వస్తాయి.

కళ్ళు పెద్దవి గా కనిపించడం..

శరీరంలో హార్మోన్స్ సమస్యల వల్ల లేదా సమతౌల్యం లేదా థైరాయిడ్ వల్ల కళ్ళు ముందుకు వచ్చినట్లు. పెద్దవిగా కనిపిస్తాయని నిపుణులు విశ్లేషించారు.కంటి వెనుక భాగం లో పసుపు పచ్చగా కొవ్వు ఉన్నట్లు కనబడుతుంది లేదంటే రెటీనా చిన్న చిన్న నీటిబొట్లు కనబడుతుంది.ఇలాంటి వారిలో టైపు 2 డయాబెటీస్ వ్యాధి వచ్చే అవకాసం ఉంది.

కళ్ళు పసుపు పచ్చగా ఉంటె..

కొందరి కళ్ళు పసుపు పచ్చగా కనిపిస్తే దాని ఆర్ధం కాలేయ సమస్య ఉందని అంటున్నారు. కళ్ళు ఇలా మారిపోడానికి కాలేయం పనితీరులో తేడా ఉండడమే. అందువల్ల వెంటనే వైద్యుడిని సలహా తీసుకుని సంప్రదించడం ఉత్తమం సమస్యనుండి బయట పడగలం.దీనిని వైద్య పరిభాషలో లివర్ బైల్ సేక్రేషణ్ ఎక్కువకవాడమని వైద్యులు నిర్ధారించారు.

కళ్ళు పొడి బారడం -లేదా అయిడ్రై నెస్..

సహజంగా శరీరానికి అందాల్సిన విటమిన్ ఏ సరిగా అందక పోవడం జిరాప్ గాల్దిమియా అని అంటారు.

కళ్ళలో నీరు కారడం..

కండ్లకలకఅంటే కండ్ల లో వచ్చ్ఘే ఇన్ఫెక్షన్ సహజంగా వర్స్ఘాకాలం లో వచ్చే సమస్య.ఇది ఒక్కోసారి ఒకరి నుండి మరొకరికి సోకే అవకాసం ఉంది కాబట్టి కండ్లకలకకు దూరంగా ఉండడం అవసరం సకాకంలో వైద్యుని సూచన మేరకు కంటి లో డ్రాప్స్ వాడాలేతప్ప సొంత వైద్యం చేయరాదని అలా చేస్తే కళ్ళు పోయే ప్రమాదం ఉందని తెలిపారు.

కండ్లు గడ్డ కట్టి నట్టుగా ఉండడం..

ఐ స్టేయ్స్ అంటే కండ్లలో గడ్డలు..

కంటిలో ఏవిధమైన డస్ట్ వచ్చి చేరినా కండ్లలో గద్దలగా తయారు అవుతుంది. 

కళ్ళు నీలి రంగులోకి మారడం..

మనశరీరం లో బ్రెయిన్ కిఆక్సిజన్ సరిగా అందక పోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల కళ్ళు నీలిరంగులోకి మారవచ్చని తెలుస్తోంది.

ఐ బ్యాగ్స్..

కంటికింద బ్యాగ్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. సహజంగా అతిగా మధ్యం తాగేవారిలో లివర్ సమస్యలు కంటికింద ఐ బ్యాగ్స్ లాగా వస్తాయి.

కళ్ళు మండడం..

కళ్ళు మండడం సహజంగా వచ్చే సమస్య. అయితే కళ్ళు మండ దానికి కారణాలలో ఎక్కువ కాంతి చూడడం.లేదా ఎక్కువ కాంతిలో పనుచేయడం. ఒత్తిడికి గురికావడం. నిద్రలేమి వంటి సమస్యలు ఉన్నందున కళ్ళు మండడం లేదా మీరు పనిచేసే ప్రాంతాలలో రసాయనాల మధ్య లేదా దుమ్ము ధూళి ఉన్నచోట కళ్ళు మండడం సహజంగా ఉంటుంది.

కళ్ళు మూతలు పడడం..

కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. ఇది ఒక న్యురోలోజికల్ దిజార్దర్ గా పెర్కిన్నారు. ఈ సమస్యకు కారణం బాగా నిల్వ ఉన్న తీసుకున్న వారికి వస్తుందని నిపుణులు నిర్దారించారు.

కంటి కింద నల్లటి వలయాలు ..

కొందరిలో కంటికింద నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. దీనికి కారణం స్టమక్ దిజార్దర్ గా పేర్కొన్నారు. కాగా సహజంగా ఒత్తిడికి గురికావడం. లేదా యాన్కజైయిటీ వల్ల కంటికింద న్హల్లటి వలయాలు వస్తాయని నిపుణులు తేల్చి చెప్పారు.

కళ్ళు డీవియేట్ కావడం..

శరీరంలో కళ్ళు ఒక్కోసారిషిఫ్ట్ అవుతూ ఉంటాయి.దీనికి కారణం  పోషక ఆహార లోపంగా పేర్కొన్నారు. అంటే సరైన పోషకాలు  లేనండువల్లె కళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటాయికళ్ళను పరిశీలించడం ద్వారా ఎన్నోరకాల రుగ్మతలను చెప్పవచ్చ్గు. నాడీ పతి ద్వారా ఎన్నోరకాల రుగ్మతలను చెప్పుకోవచ్చు. ఈ పద్దతిని నాడీ పతి లో ఇరిదోలజీ అని అంటారు.మనం చెప్పుకున్న కొన్ని అంశాలు పైకి కనిపించే కళ్ళ యొక్క సిమ్టమ్స్  ను ఆధారంగా ఏదైనా లక్షణం కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. దీనిఆదారంగానే చికిత్చ తీసుకోవచ్చు అని నిపుణులు పేర్కొన్నారు.