ఫోటో ఇచ్చిన అమితానందం
posted on Oct 25, 2022 @ 2:07PM
ఇప్పుడంటే సెల్ఫీలు వచ్చాయిగాని ఈమధ్య వరకూ ఫోటోలదే రాజ్యం. బాల్యంలో తీయించు కున్న ఫోటోలకు మరింత విలువ. అప్పట్లో యే ప్రముఖ వ్యక్తితోనో తీయించుకున్న ఫోటో చాలాకాలం ఎంతో పదిలంగా దాచుకోవడం పరిపాటి. అది ఏకంగా ముఖ్యమంత్రితో తీయించుకున్నదయితే మరీ పదిలం చేసుకోవడం దాన్ని చూసుకుంటూ మురిసిపోవడం జరుగుతూంటుంది. స్కూల్లో, అపీసులో తోటి మిత్రులతో అ అనందం పంచుకుంటాం. మరీ వింతేమంటే..చాలాకాలం ఏ ప్రముఖుడితో ఫోటో తీయించుకున్నామో అదే ప్రముఖుడు మరింత పెద్ద స్థాయిలో కలిస్తే ? అ అనందానికి అంతే ఉండదు. సరిగ్గా ఇదే జరిగింది ఒక మేజర్ కి.
గజరాత్ కి చెందిన అమిత్ బాలాచాడిలోని సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. 2001లో ఆయన స్కూల్ ఫంన్ కి నరేంద్ర మోడీ వెళ్లారు. అప్పుడు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఆయన చేతుల మీదుగా అమిత్ ఓ షీల్డ్ అందుకున్నారు. ముఖ్యమంత్రితో ఫోటో తీయించుకన్న ఆనందం అందరికీ పంచుకున్నారు. దాన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు. తర్వాత చదువు పూర్తిచేసుకున్న అమిత్.. భారత సైన్యంలో చేరి మేజర్ అయ్యారు. ప్రస్తుతం కార్గిల్ లో విధులు నిర్వహిస్తున్నారు. చిత్రంగా చాలా కాలం తర్వాత మోదీని ఇన్నాళ్లకి కలిశారు. ఈసారి తాను మేజర్, ఆయన దేశ ప్రధాని.
దేశ ప్రధాని నరేంద్ర మోదీతో తన పాత జ్ఞాపకాన్ని పంచుకునే అవకాశం అమిత్కి వచ్చింది. ఈ అరు దైన సంఘటనకు ప్రధాని మోదీ కార్గిల్ పర్యటన వేదికగా మారింది. దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్ లో పర్యటిస్తారని తెలియడంతో అమిత్ సంతోషం పట్టలేకపోయారు. వెంటనే తన చిన్ననాటి ఫొటో ఫ్రేంను తెప్పించుకుని, ప్రధానికి ఆ ఫొటో చూపించే క్షణాల కోసం ఆతృతగా ఎదురు చూశారు.
ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి నరేంద్ర మోదీ ఏటా దీపావళి పండుగను సైనికులతో జరుపు కుంటూ వస్తున్నారు. ఈ ఏడాది కార్గిల్ లో పర్యటించారు. అక్కడి సైనికులతో వేడుకలు జరుపుకుం టుండగా.. అమిత్ ఆయన దగ్గరికి వచ్చి చిన్నప్పటి సంగతిని గుర్తుచేశాడు. అప్పటి ఫొటోను మోదీకి చూపించారు. ఇద్దరూ అప్పటి విశేషాలను గుర్తుకుతెచ్చుకున్నారు. అమిత్తో పాటు ప్రధాని కూడా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆనాటి ఫొటోను పట్టుకుని ప్రధాని మోదీ, మేజర్ అమిత్ మళ్లీ ఫొటో దిగారు.