ప్రతి ఒక్కరికి జీవించే హక్కు
posted on Oct 21, 2021 @ 11:30AM
స్వచ్చ మైన వాతావరణం పొందడం మానవహక్కు ---యు ఎన్ మానవహక్కుల కాన్సిల్ తీర్మానం.
ప్రపంచం లో వాతావరణ కాలుష్యం రాసాయానాలు వెలువడడం ఇతర వాతవరణాల వల్ల తీవ్ర ప్రమాదం పొంచి ఉందని దీనికారణంగా 13.7 మిలియన్ల మరణాలు ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 24%గా ఉందని ఐక్య రాజ్యసమితి జాతీయ మానవహక్కుల మండలి తీర్మానం ప్రవేసపెట్టింది.తీర్మానం లో స్వచ్చ మైన,పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన వాతావరణం మనవహక్కని ఐక్యరాజ్య సమితి హై కమీషనర్ సభ్య దేశాలు ఈనిర్ణ యాన్ని అమలు చేసేందుకు పని చేయాల్సి ఉందని ఇది ల్యాండ్ మార్క్ గా యు ఎన్ పేర్కొంది.
ప్రపంచం లో ప్రతి ఒక్కరికి స్వచ్చమైన ఆరోగ్యవంతమైన వాతావరణం పొందడం ప్రాధమిక హక్కు గా పేర్కొంది.ఈసమావేశం లో కోస్టారికా,మాల్దీవ్స్,మొరాకో,స్లోవేనియా,స్విట్జర్ ల్యాండ్,దేశాలు తీర్మానం 48 /13 మెజారిటితో ఆమోదం లభించింది అంటే తీర్మానానికి 43 దేశాలు మద్దతు తెలిపాయి. కాగాచైనా, భారాత్, జపాన్, రష్యా దేశాలు తటస్తంగా ఉండడం గమనార్హం.యు ఎన్ ఆమోదించిన తీర్మానాన్ని ధైర్యంగా అమలు చేయాలనీ,ఆరోగ్యవంతమైన వాతావరణం ద్వారా పారదర్సకత తో కూడిన ఆర్ధిక, సాంఘిక వాతావరణం విధాన నిర్ణయం ప్రజలకు రాక్షన తో పాటు.ప్రకృతిని పరిరక్షిస్తుందని ఐక్య రాజ్యసమితి జాతీయ మానహక్కుల సామాఖ్య కమీషనర్ మిచెల్లీ బచ్ల్ట్ నొక్కి చెప్పారు.