ఈటలకు కేసీఆర్ మరో షాక్! 

అసైన్డ్ భూములు అక్రమించారనే ఆరోపణలతో ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్.. మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది  ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని టీఆర్ఎస్ అధినాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కరీంనగర్ టీఆర్ఎస్ నేతల తీర్మానం చేస్తూ కేసీఆర్ లేఖ ఇచ్చారని చెబుతున్నారు. 

ఈటల వ్యవహారంపై చర్చించేందుకు సమావేశమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ముఖ్యనేతలు.. ఆయనపై పార్టీపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్,  ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, రసమయి, మాజీ ఎంపీ వినోద్ తో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా  సంతకాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని ఉమ్మడి కరీంనగర్ నేతలు సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.