ఏనుగు పోస్ట్‌మార్టం రిపోర్ట్.. కన్నీళ్లు ఆగవు
posted on Jun 5, 2020 @ 2:21PM
ఆకతాయిల మూర్ఖపు చర్యకు కేరళలో ఓ గర్భిణి ఏనుగు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఆ ఏనుగు పోస్టుమార్టం నివేదిక తాజాగా వెల్లడైంది. ఆ ఏనుగు పేలుడు పదార్థాలున్న పైనాపిల్ తిన్న 14 రోజుల తర్వాత చనిపోయిందని తేలింది. పేలుడు పదార్థాల వల్ల ఏనుగు నోటి భాగం తీవ్రంగా గాయపడిందని, తీవ్ర నొప్పిని భరిస్తూ 14 రోజుల పాటు ఏమీ తినలేదని, తాగలేదని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. ఓ వైపు నొప్పి, మరోవైపు ఆకలి భరించలేక, నదిలో ఉండిపోయిందని.. చివరకు ఆ ఏనుగు నీరసించిపోయి నీటిలో పడిపోయిందని వివరించారు. నీళ్లలో మునగడం వల్ల, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది.
కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేరళ ప్రభుత్వం నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే, ఈ ఘటనలో ముగ్గురు అనుమానితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది.