మార్చి 16 నుంచి అమలులోకి ఎన్నికల కోడ్.. షెడ్యూల్ ప్రకటించనున్నఈసీ
posted on Mar 15, 2024 @ 3:19PM
2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ శనివారం (మార్చి 16) విడుదల కానున్నది. కేంద్ర ఎన్నికల కమిషన్ లో ఖాళీగా ఉన్న ఇద్దరు కమిషనర్ల భర్తీ పూర్తి కావడంతో ఇక ఎన్నికల నిర్వహణపై సీఈసీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం 3 గంటలకు మీడియా సమావేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలిసింది.
కాగా విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిథి ఎక్స్ వేదికగా తెలిపారు. శనివరాం (మార్చి 15) సాయంత్రం 3 గంటలకు హస్తినలోని జ్ణాన్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నిల ప్రకటనతోనే ఎన్నికల నియమావళి అమలులోనికి వస్తుందని వివరించారు. కోడ్ అమలులోకి రావడం అంటే కేంద్రంలో , రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎటువటి విధానపరమైన నిర్ణయాలూ తీసుకునే అవకాశం ఉండదు.
ఇక విషయానికి వస్తే ప్రస్తుత లోక్ సభ పదవీ కాలం జూన్ 16తో ముగుస్తుంది.ఆ గడువుకు ముందే కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్నికల షెడ్యూల్ విషయానికి వస్తు 2019 ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10న నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ సారి ఆరు రోజుల ఆలస్యంగా ప్రకటించనుంది.