నేషనల్ హెరాల్డ్‌కేసు...గీతారెడ్డి, రేణుకాచౌదరీలకు ఈడీ పిలుపు
posted on Sep 30, 2022 @ 12:56PM
నేషనల్ హెరాల్డ్ కేసు లో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అమలు చేస్తు న్న రాజకీయ వ్యూహాలు అంతుచిక్కడం లేదు. ఒకవంక పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తూనే, అందుకు భారీ కార్యక్రమాలు, ప్రదర్శనలు చేస్తూనే మరోవంక ప్రధాన ప్రతిపక్షానికి నిద్రలేకుండా చేస్తోంది. నేష నల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని పలుమార్లు ఈడీ పిలిచి విచారిం చారు. ఇపుడు తాజాగా తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు పిలుపు వచ్చింది.
అక్టోబర్ 11, 12 తేదీల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ నోటీ సులు అందుకున్న నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ రావాల్సిందిగా పిలుపిచ్చింది. టీ కాంగ్రెస్ నేతలు షబ్బీర్అలీ గీతారెడ్డి , అంజన్ కుమార్ యాదవ్ , సుదర్శన్‌రెడ్డి , రేణుకాచౌదరి , అనిల్‌కుమార్ తదిత రు లు ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ఏఐసీసీ ఆడిటర్లతో భేటీ కానున్నారు. కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు చేస్తున్న ఆలోచనలు, తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగు లు ప్రత్యర్ధి పార్టీలకు అర్ధం కావడం లేదు. ఓవైపు ఆపరేషన్ ఆకర్షణ పేరుతో ఇతర పార్టీల నేతలకు వల వేస్తూనే మరోవైపు ఈడీ కొరడాను ఝుళిపిస్తోంది. బీజేపీ వలలో చిక్కని నాయకులు, కమలం వైపు చూడ ని పార్టీల నేతలపై కొత్త ఆస్త్రాన్ని ప్రయోగిస్తోందనే విమర్శలు కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినిపిస్తు న్నాయి. ఇప్పటికే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ (టీఆర్ ఎస్) నేతలపై ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోప ణలతో ఈడీ ని ప్రయోగిస్తున్న కేంద్రం .. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలను వదలడం లేదు. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రస్తుతం కీలక నాయకు లకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది.
తెలంగాణలో ఓ వైపు లిక్కర్ స్కాంపై సోదాలు జరుగుతున్న సమయంలోనే ఐదుగురు కాంగ్రెస్ నేతల కు ఈడీ నోటీసులు జారీ చేశారన్న వార్త హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో మంత్రులుగా పనిచేసిన ముగ్గురి తో పాటు ఇద్దరు ఎంపీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌లుగా ఉన్న గీతారెడ్డి, రేణుకాచౌదరి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అంతే కాదు అక్టోబర్ 10వ తేదిన విచారణకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని కోరడం జరిగింది.