తైవాన్ లో కంపించిన భూమి.. కుప్పకూలిన భవనాలు
posted on Sep 19, 2022 6:29AM
తైవాన్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.8గా నమోదంది. పలు భవనాలు కుప్పకూలాయి. రైళ్లు పట్టాలు తప్పాయి. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. టైటుంగ్ కౌంటీలో సంభవించి ఈ భూకంపం కారణంగా ప్రజలు ఇళ్లలో నుంచి భయంతో బయటకు పరుగుతు తీశారు.
అంతకు ముందు కూడా ఇదే ప్రాంతంలో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ముందు సంభవించిన భూ కంప తీవ్రత 6.4కాగా, 24 గంటల వ్యవధిలో మరో సారి భూమి కింపించిందని వివరించారు.భవన శిధిలాల కింద చిక్కుకున్న పలువురిని అధికారులు రక్షించారు.
కాగా భూకంపం కారణంగా భవనాలు కుప్పకూలడంతో పలువురు గాయపడ్డారు. అలాగే బ్రిడ్జి కుప్పకూలడంతో పలువురు గాయపడ్డారు. పలు రైళ్లు పట్టాలు తప్పాయి. రైల్వే స్టేషన్లలో నిలిపి ఉన్న రైళ్లు అట్టబొమ్మల్లా ఊగిసలాడాయి. ఆస్తి నష్టం వివరాలు అందాల్సి ఉంది. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.