అపారం ఉమ ఔదార్యం.. జీజీహెచ్‌కు రూ.20 కోట్ల విరాళం
posted on Oct 6, 2022 @ 10:09AM
అదృష్టం వరించి లాటరీ తగిలి లక్షలు వస్తేనే కాళ్లు భూమ్మీద ఉండవు. ఒక్క రూపాయి ఎవరియినా ఇవ్వాలన్నా, ఏదన్నా వస్తువు కొనివ్వాలన్నా బొత్తిగా మనసొప్పదు. అదే చిత్రం డబ్బులేని సమయం, ధనికుడైపోయాక మారే స్థితి. కానీ చాలా తక్కువమందే గుప్తదానాలతో ప్రసిద్ధులవుతారు. అదుగో అలాంటి గొప్ప దాత డాక్టర్ ఉమా గవివి. ఆమె 20కోట్ల ఆస్తిని గుంటూరులోని జీజీహెచ్ ఆస్పత్రికి విరా ళంగా ఇచ్చేశారు. ఇది లోకం హర్షించదగ్గ విషయం.
ఇక్కడ చదువుకుని విదేశాల్లో ఉన్నతోద్యోగాల్లో, ఉన్నతస్థాయిల్లో ఉన్నవారు చాలామంది తాము చదువు కున్న పాఠశాలకో, కాలేజీకో విరాళాలుగా ఒకేసారి లేదా ప్రతీ ఏడూ ఎంతో కొంత విరాళంగా పంపడం జరు గుతోంది. అది వారి సంస్కారం. ఎప్పుడన్నా వచ్చినపుడు ఆ విద్యాసంస్థలకు వెళ్లి బాల్యా న్ని గుర్తు చేసుకుని ఆనందాన్ని మూటగట్టుకు వెళుతూంటారు. కానీ ఉమా గవిని మాత్రం జీవి తాంతం సరిపడా గొప్పఆనందాన్ని, సంతృప్తిని మూటగట్టుకున్నారనాలి. 20 కోట్ల ఆస్తిని ఒక్కసా రిగా అమాంతం వదులు కునే ఆలోచన, ధైర్యం, మనసు ఆమెది వెలగట్టలేని ఔదార్యం.
డాక్టర్ ఉమా గుంటూరు జీజీహెచ్‌లోనే చదువుకున్నారు. ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న మాతాశిశు సంక్షేమ భవనానికి విరాళంగా ఆమె ఆ మొత్తాన్ని ఇచ్చేరు. ఆమె అమెరికాలో ఇమ్యునాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల కిందట అమెరికా వెళ్లి.. స్పెషలిస్ట్ డాక్టర్‌గా అక్కడే స్ధిరపడ్డారు. గత నెలలో డల్లాస్‌లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్ సమావేశాల్లో ఉమా పాల్గొన్నారు. తాను మెడిసిన్ చేసిన జీజీ హెచ్‌కు భారీ విరాళం ఇవ్వాల న్న నిర్ణయాన్ని ఆమె అక్కడి వేదిక మీదే ప్రకటించారు.
డాక్టర్ ఉమ భర్త డాక్టర్ కానూరి రామచంద్ర రావు ఈమధ్యనే మృతి చెందడం. డాక్టర్ రావు కర్ణాటకలోని గుల్బర్గా లో మెడిసిన్ చేసి, ఎనస్థటిస్ట్ గా సేవలు అందించారు. ఆమెకు వారసులు ఎవ్వరూ లేరు. ఆమె ఇన్నాళ్లు గా సంపా దించి ఆస్తి మొత్తం ఇలా విరాళంగా ఇవ్వడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నా రు. ఉమా 2008లో ‘జింకానా’ అధ్యక్షురాలిగా సేవలందించారు. ఆమె అందించిన విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ బ్లాక్‌కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు సూచించారు. కానీ, ఈ ప్రతి పాదనను ఆమె సున్నితంగా తోసిపుచ్చారు. చివరికి డాక్టర్ ఉమా భర్త పేరు ను ఈ బ్లాక్‌ను పెట్టాలని నిర్ణయించారు. జింకానా రీ యూనియన్ సమావేశాల్లో డాక్టర్ ఉమా గవిని రగిల్చిన స్ఫూర్తితో ఇతర వైద్యులు సైతం ముం దుకు వచ్చారు.