సింగర్ మంగ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ లో డ్రగ్స్ కలకలం
posted on Jun 11, 2025 @ 12:27PM
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకలలో డ్రగ్స్ వినియోగం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మంగ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ రంగరెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామ శివారులో మంగళవారం (జూన్ 10) రాత్రి జరిగాయి. కాగా ఈ వేడుకలలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంలో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు.
ఈ దాడులలో మంగ్లీ బర్తడే సెలబ్రేషన్స్ లో డ్రగ్స్ వినియోగం జరిగినట్లు వెల్లడైంది. ఈ వేడుకలకు 50 మంది వరకు కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరయ్యారు. అలా హాజరైన వారిలో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి రెండు గంటల తర్వాత sot పోలీసులు దాడులు చేపట్టారు. దాడుల్లో దాదాపుగా 48 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, వారిలో తొమ్మండుగురికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగే విదేశీ మద్యం కూడా పెద్ద ఎత్తున వినియోగించినట్లు పోలీసులు చెబుతున్నారు.