ఆధునిక దేవాలయాల రూపశిల్పి కే.ఎల్.రావు
posted on Jul 16, 2022 @ 12:57PM
కానూరి లక్ష్మణరావు అంటే ఒక్కరికి కూడా తెలియదుకాని డా.కే.ఎల్రావు గా జగద్విఖ్యాతులు. ఆయన్ను భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆధుని దేవాలయాల రూపశిల్పి అని ప్రశంసించారు. కృష్ణాజిల్లా కంకిపాడులో జూలై 15, 1902 జన్మించారు. ఆయన సోదరి ప్రముఖ వైద్యులు డా. కొమర్రాజు అచ్చమాంబ. గ్రామకరణం అయిన తండ్రి గారు 9 వ ఏటనే గతించారు. చిన్నతనంలో బడిలో ఆటలాడుతుండగా దెబ్బ తగిలి ఒక కంటి చూపు కోల్పోయారు రావు. ప్రాధమిక విద్య తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజిలో చేరి ఇంటర్, గిండీ ఇంజనీరింగ్ కాలేజీ లో మొదటి బాచ్ విద్యార్ధిగా చేరి ఇంజనీ రింగ్ లో మాస్టర్ డిగ్రీ పొం దారు . లండన్ వెళ్లి బర్మింగ్ హాం యూనివర్సిటి నుంచి 1939 లో పి.హెచ్ .డి .తీసుకున్నారు. కే .సి చాకో మార్గదర్శకంలో ఎంతో పరిశోధన చేశారు. అప్పట్లో మద్రాస్ యూనివర్సిటి నుంచి మొదటి ఎం.ఎస్ .డిగ్రీ అందుకున్న ఘనుడాయన. అనంతరం రంగూన్ బర్మాలలో ప్రొఫెసర్ గా పని చేశారు .
లండన్ లో కాంక్రీట్ కు సంబంధించిన అంశాలపై తీవ్ర అధ్యయనం, పరిశోధనలు చేశారు. అమెరికా వెళ్లి సెల్యులర్, కాఫర్ శైలీ నిర్మాణం మీద సాధికారత సాధించి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వానికి సమర్పిం చారు. మద్రాసులో కూవం నదిపై ఉన్న పురాతన ఇనుప బ్రిడ్జి తుప్పు పట్టి కూలియే స్థితికి రావడంతో కాంక్రీట్ తో పునర్నిర్మించి దేశాన్నీ ప్రపంచాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన సమర్ధులైన ఇంజనీర్ ఆయన. అప్పటికి ప్రపంచం లో ఒక్క ఫ్రాన్స్‌లోనే కాంక్రీట్ కట్టడాలు నిర్మించేవారు. ఫ్రాన్స్ వెళ్ళకుండానే, ఆ కట్ట డాలను చూడకుండానే తన అసాధారణ మేదస్సుతో కాంక్రీట్ వంతెన నిర్మించి , రైల్వే చీఫ్ ఇంజనీర్ ప్రశంసలు అందుకున్న సమర్ధులు . ఈ బ్రిడ్జి నిర్మాణం అయ్యాకనే రావు గారు ఫ్రాన్స్ వెళ్లి, ఇంజనీర్ ఫ్రేన్సియనేట్ వద్ద శిక్షణలో కౌశల్యానికి మరింత మెరుగులు దిద్దుకున్నారు. అక్కడి నుంచి లండన్ వెళ్లి కాంక్రీట్ ఇంజనీరింగ్ సంస్థలో చేరి పరిశోధనలు కొనసాగించారు .మద్రాసులో జీత జీవితాన్ని వదలి, మళ్ళీ లండన్ వెళ్లి కాంక్రీట్ పరిశోధన చేశారు. లండన్ థేమ్స్ నది పై కట్టిన వంతెనను సాకల్యంగా పరి శీలించి తన సృజనాత్మక శక్తితో నూతన పరిశోధనలు చేశారు .
ప్రముఖ ఇంజనీర్ జే.ఏ. సాలేజ్ వద్ద అసిస్టెంట్ గా చేరి వంతెనల నిర్మాణాలకు సలహాలిస్తూ సహాయ మందించారు. ఆంధ్రుల చిరకాల కల శ్రీరామ పాద సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రణాళిక కోసం మద్రాసు ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ గోవిందరాజు అయ్యంగార్ కలిసి లండన్ ప్రాజెక్ట్ డిజైనింగ్ పై విస్తృత అధ్యయ నం చేసి ఒకే ఒక్క ఏడాదిలో డ్యామ్ డిజైన్ రూపొందించారు. ఆ డిజైన్ లపై ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోవ టం వలన అవి దుమ్ము కొట్టుకుపోయి అప్పట్లో సాకారమవలేదు. నాగార్జున సాగర్ నిర్మాణంలో రాతి కట్టడం నమూనాను అమెరికా డెన్మార్క్ ప్రయోగశాలలకు పంపి, పరిశోధనా ఫలితాలను తెప్పించారు.
విశాఖ , రంగూన్, మద్రాస్ లలో నీటి పారుదల శాఖ లో పని చేశారు. లండన్ ఇంజనీరింగ్ కాలేజి లెక్చ రర్ గా చేశారు. మద్రాస్ ప్రభుత్వ డ్యామ్‌లను రూపొందించే ఇంజనీర్ గా సేవలందించారు 1962 లో కేంద్ర జల విద్యుత్ మంత్రిత్వ శాఖ లో డిజైన్ అండ్ రిసెర్చ్ విభాగ సభ్యుడిగా సేవలు అందిం చారు. అలాగే కేంద్ర జల,విద్యత్ శక్తి సహాయ మంత్రిత్వ శాఖ ఇంజనీర్ గా ,ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ డిజైన్ గా, చీఫ్ ఇంజనీర్ గా చిరస్మరణీయ సేవలందించారు. 1954 లో కేంద్ర జల,విద్యుత్ కమీషన్ చీఫ్ ఇంజనీర్ ,1959 లో విద్యుచ్చక్తి , నీటి పారుదల కేంద్ర మండలి అధ్యక్షులుగా ఉన్నారు. పద్మవిభూషన్ డాక్టర్ కే.ఎల్ రావుగారు 1986 మే 18న తమ 86వ యేట హైదరాబాద్‌లో మృతి చెందారు.