కేబుల్ బ్రిడ్జ్ ఆధునీకరణపైనే అనుమానాలు..140 కి చేరుకున్న మృతుల సంఖ్య
posted on Oct 31, 2022 @ 1:24PM
సాయింత్రాలు సరదాగా గడపడానికి పార్కులు, సినిమాలు సరేసరి. కానీ సరదాలు హఠాత్తుగా విషాదభరితంగా మారు తుందని ఎవ్వరూ ఊహించరు. గుజరాత్ లో అదే జరిగింది. అక్కడి కేబుల్ బ్రిడ్జ్ ఉన్నట్టుండి అమాంతం నీటిలోకి కూలిపోయింది. ఈ సంఘటనలో మరణించినవారి సంఖ్య 140కి చేరుకుంది. బ్రిటీష్ కాలంనాటి వంతెనను కొద్ది మాసాల క్రితం మరింత మెరుగులు దిద్ది బావుచేశారని చెబుతున్నారు. నాలుగురోజుల నుంచే వంతెన మీదకు సందర్శకులను అనుమతిస్తు న్నారు. ఈ సంఘటనలో 177 మందిని రక్షించగా, తీవ్ర గాయాలకు గురయిన 20 మందిని చికిత్సకు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బ్రిగేడ్ వారు రంగంలోకి దిగారు.
కానీ కొంత భాగం ఇటీవలే ఆధునీకరించిన వంతె ఈవిధంగా కూలిపోవడం పట్ల పర్యాటకులు విస్తు పోయారు. ఇది ఎవరి లోపం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్రిటీష్ కాలం నాటి వంతెనను ఆధునీ కరించిన అధికారుల మీద అనుమానాలకు దారితీయిస్తోంది. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటు న్న వంతెన పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్న అనుమానాలు, ప్రశ్నలు వినవస్తు న్నాయి.
అయితే ఈ సంఘటనలో ప్రాణాలతో బయట పడినవారు మాత్రం కూలడానికి కారణం అల్లరిమూక లనే చెబుతున్నారు. వారు హఠాత్తుగా వంతెనపై ఆడుతూ విపరీతంగా ఊపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనే అంటు న్నారు. అయినప్పటికీ అంతమాత్రాన కూలిపోతుందని అనుకోవడానికీ వీలులేదు. అల్తరి మూకలు ఆ విధంగా వ్యవహరించడం నేరమే కావచ్చు కాని వంతెనను బాగు చేయించిన కొద్ది మాసాలకే ప్రమాదం జరగడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.
వాస్తవానికి ప్రమాదం జరిగిన సమయంలో 500 మంది వరకూ సందర్శకులు ఉన్నారని, వీరంతా నదిలోకి పడిపోయా రని తెలుస్తొంది. హఠాత్తుగా పడడంతో వెంటనే నదిలోకి దిగి కాపాడేవారు అంతగా లేపోవడంతో వెంటనే స్పందించి రక్షణ చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకపోవడం వల్లనే మరణించినవారి సంఖ్య పెరిగిందని అంటున్నారు.