సుశాంత్ సింగ్ మృతి వెనుక కుట్ర.. ఆత్మహత్య కాదు, హత్యే!!
posted on Jun 15, 2020 @ 9:36AM
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు, హత్య అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సుశాంత్ మృతిపై అనుమానాలున్నాయని, వెంటనే న్యాయ విచారణ జరిపించాలని సుశాంత్ మావయ్య డిమాండ్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతని మృతి వెనుక ఏదో కుట్ర ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్‌ది ముమ్మాటికి అయి ఉంటుందని, పోలీసులు నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
సుశాంత్ మృతిపై బంధువులే కాదు, రాజకీయ నాయకులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, అతనిని హత్య చేశారని జన్ అధికార్ పార్టీ చీఫ్ పప్పు యాదవ్ ఆరోపించారు. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని పప్పు యాదవ్ డిమాండ్ చేశారు.