కాంగ్రెస్ న్యూస్ ఛానల్‌పై సందేహాలు
posted on Aug 1, 2012 @ 10:10AM
రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఏర్పాటు చేసిన ధర్మాన కమిటీ కాంగ్రెస్‌కో మీడియా ఉండాలని లేక పోతే రానున్న ఎన్నికల్లో రాణించడం కష్టం తేల్చేసింది. అయినా అధికార పార్టీగా సమాచార శాఖను వినియోగించుకోకుండా కొత్తగా మీడియా ఆలోచన ఎందుకనేది మరో వర్గం వాదన. ఏది ఏమైనా అన్ని పార్టీలకు మీడియా ఉండి కేవలం అధికార పార్టీకి లేకపోవడం వెలితే అని మరికొందరి అభిప్రాయం. తమిళనాడులో కాంగ్రెస్‌తో సహా ప్రతి పార్టీకి ఒక ఛానల్ ఉందని అక్కడి యస్‌సి, యస్‌టిలకు కూడా మరొక కొత్త ఛానల్ ప్రతిపాదనలో ఉండటాన్ని కొందరు నేతలు గుర్తుకు తెస్తున్నారు.
అయితే అధికార కాంగ్రెస్ ఛానల్ నిర్వహణలో మరి కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయని మరికొంతమంది నాయకులు వివరిస్తున్నారు. అధికార కాంగ్రెస్ నాయకులు మాత్రమే మీడియాను ఉపయోగించుకుంటారా లేదా వ్యతిరేకులూ, పార్టీలో పదవులు రాని వాళ్లూ ఉపయోగించుకుని ఉన్న పరువును పోగొడతారా అనేది కొందరినేతల సందేహం. ప్రజల అవసరాలు, అధికధరలు లాంటి అత్యవసరాలు ప్రభుత్వం పట్టించుకోకుండా, సామాన్య మానవుడి బ్రతుకుని దుర్బరం చేస్తున్న సమస్యలను చేధించకుండా ఎన్ని ఛానల్స్ పెట్టినా ఏంటట అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.