భారత్‌కు మరో దెబ్బ..డోపింగ్ టెస్ట్‌లో దొరికిన ఇంద్రజిత్
posted on Jul 26, 2016 @ 9:48AM
నిన్న గాక మొన్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి దొరికిపోయి, ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశ ప్రతిష్టను దెబ్బ తీశాడు. అది మరచిపోకముందే మరో క్రీడాకారుడు డోపింగ్ టెస్ట్‌లో అడ్డంగా దొరికిపోయాడు. షాట్‌పుట్ ఆటగాడు ఇంద్రజిత్ సింగ్ సైతం ఉత్ప్రేరకాలు వాడినట్లు వెల్లడైంది. గత నెల 22న నిర్వహించిన డోప్ పరీక్షల్లో ఆయన పట్టుబడ్డారు. ఆపై "బీ" శాంపిల్ పరీక్షల్లోనూ అదే ఫలితం వచ్చింది. రియోలో జరిగే షాట్‌పుట్ విభాగంలో ఇంద్రజిత్ పాల్గొనాల్సి ఉంది. డోపీగా పట్టుబడటంతో, ఆయన బ్రెజిల్‌లో అడుగుపెట్టే ఛాన్స్ మిస్సయ్యింది. రియో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే ఆటగాళ్లు ఒక్కొక్కరిగా డోప్ టెస్టుల్లో దొరికిపోవడం భారత క్రీడారంగంపై పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆసియా ఛాంపియన్‌షిప్, ఆసియా గ్రాండ్ ఫ్రీ, వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్‌లో ఇంద్రజిత్ గతేడాది స్వర్ణం కైవసం చేసుకున్నాడు.