ఇక చర్చలకు నో..ఏపీ సీపీఎస్ యు నేతలు
posted on Sep 6, 2022 @ 5:42PM
ప్రస్తుతానికి పరిస్థితులను అర్ధంచేసుకుని జీపీఎస్‌ను అంగీకరించాలని ఏపీ మంత్రులు బొగ్గన, బొత్స సీపీఎస్ నాయకులను కోరారు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించమని వారు తెగేసి చెప్పారు. జీపీఎస్ సంబంధించి చాలారోజులుగా నలుగుతున్న సమస్యను పరిష్కరించేందుకు మంగళ వారం ఉద్యోగ సంఘాల నాయకులతో ఏపీ మంత్రులు చర్చకు మరోసారి ఆహ్వానించారు. కానీ వారి చర్చ లు విఫల మయ్యాయి.
ఈ సందర్భంగా ఏపీసీపీఎస్‌యూఎస్ అధ్యక్షులు సీఎం దాసు మాట్లాడుతూ పాత పెన్షన్‌పై చర్చిద్దాం అన్న మీదటే చర్చలకు వచ్చామని తెలిపారు. సీపీఎస్‌లో గవర్నమెంట్ షేర్ ఈ రోజుకు ఇవ్వడం లేద న్నారు. పిలిచి మరలా జీపీఎస్ గురించే మాట్లాడుతున్నారని.. ఇకపై అసలు చర్చలకు పిలవవద్దు అని చెప్పామని అన్నారు.
వేలాది మంది ఏపీసీపీఎస్‌యూఎస్ నాయకులు, టీచర్‌లపై కేసులు నమోదు చేశా రని మండిపడ్డారు. అక్రమ కేసులను రద్దు చేయాలని కోరామన్నారు. డీజీపీని కలిసి కేసులు ఎత్తి వేయా లని కోరనున్నట్లు చెప్పారు. అక్రమ కేసులు పెట్టినందున మంత్రులు బొత్స, బుగ్గనలకు వినతి పత్రం ఇచ్చామని దాసు తెలిపారు.
ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షులు అప్పలరాజు మాట్లాడుతూ మరో మిలియన్ మార్చ్ ద్వారా సీపీఎస్ మహమ్మారిని తరిమి కొట్టాలని బావించామన్నారు. గత ఏడేళ్లలో పోలీసుల అనుమతి లేకపోతే ఏ కార్య క్రమం చేయలేదని తెలిపారు. సీఎం ఇల్లు ముట్టడి నెప్పాన్ని చూపి తమకు సంబంధం లేకపోయినా కేసులు పెట్టారని మండిపడ్డారు. జిల్లా ప్రెసిడెంట్‌ను తీసుకు వెళ్లి కేసులు పెట్టారన్నారు. నిజానికి ఆరోజు స్కూల్‌లో ఉన్న నాపై సీఎం ఇంటిని ముట్టడికి కుట్రచేశానంటూ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశా రు.
ఈ కేసులను వెంటనే తొలగించాలని బొత్సను కోరామన్నారు. సెప్టెంబర్ 11న మిలియన్ మార్చ్, చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి ఇస్తే చేస్తాము లేకపోతే మరల వాయిదా వేస్తామని అప్పలరాజు వెల్లడించారు.