ట్రంప్ అలాంటివాడే అని నమ్ముతున్న అమెరికన్లు..
posted on Oct 31, 2016 @ 12:24PM
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది అక్కడ సర్వేలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇప్పటికి పలు సర్వేలు చేసిన సంస్థలు ఇప్పుడు ట్రంప్ పై సర్వే నిర్వహించారు. రిపబ్లికన్ల తరపున పోటీ చేస్తున్నడొనాల్డ్ ట్రంప్ మహిళలపై పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వివిధ సందర్భాల్లో తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని, ఆయన చేత లైంగికంగా వేధింపులకు గురయ్యామని పలువురు మహిళలు తెలిపారు. అయితే ఇప్పుడు ట్రంప్ పై వచ్చిన ఆరోపణలు ఎంత వరకూ నమ్ముతున్నారని ఓ సర్వే నిర్వహించారు. ఏపీ-జీఎఫ్ కే సంస్థ చేసిన ఈ సర్వేల్లో 70 శాతం మంది అమెరికన్లు ఆ ఆరోపణలు నిజమని నమ్ముతున్నారట. ఇక ఈ ఆరోపణలను ప్రత్యర్థుల కుట్రగా, ట్రంప్ అభివర్ణిస్తున్నప్పటికీ, అమెరికన్లు మాత్రం ట్రంప్ పై వచ్చిన ఆరోపణల్ని నమ్ముతున్నారట. దీంతో ప్రత్యర్థి హిల్లరీ పైచేయి సాధిస్తుందని ట్రంప్ వర్గీయులు ఆందోళన చెందుతున్నారట. కాగా నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.