మహిళలను నాలా ఎవరూ గౌరవించరు.. పగలబడి నవ్విన ఆడియన్స్
posted on Oct 20, 2016 @ 5:48PM
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్..డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ మధ్య చివరి డిబేట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ డిబేట్ లో ట్రంప్ వ్యాఖ్యలకు ఆడియన్స్ తెగ నవ్వుకున్నారట. అయితే ట్రంప్ వేసిన జోక్ ఏంటి... ట్రంప్ ఏం అన్నాడు.. దానికి ఆడియన్స్ ఎందుకు అంతలా నవ్వారు అనే కదా డౌట్.. అసలు సంగతేంటంటే... ఈ మధ్య ట్రంప్ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ వీడియో తరువాత పలువురు మహిళలు కూడా ట్రంప్ పై ఆరోపణలు చేశారు. ఇది వ్యవహారం అయితే పెద్ద దుమారమే రేపింది. అయితే మూడో డిబేట్ లో ట్రంప్ మాట్లాడుతూ...'నేను గౌరవించినంతగా మహిళలను మరెవరూ గౌరవించరు అని వ్యాఖ్యానించగానే.. ఆడియన్స్ పగలబడి నవ్వారట. దీంతో, ఈ డిబేట్ కు సమన్వయకర్తగా వ్యవహరించిన ఫాక్స్ న్యూస్ యాంకర్ క్రిస్ వాలస్ కల్పించుకుని ‘ప్లీజ్, ఎవిరిబడీ’ అంటూ నిశ్శబ్దంగా ఉండాలంటూ ఆడియన్స్ ని కోరారట.