ట్రంప్ వ్యక్తిత్వానికి తప్పదు భారీ మూల్యం..
posted on Oct 14, 2016 @ 1:21PM
కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది అంటే ఇంకెవరూ రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసే డొనాల్డ్ ట్రంప్ ది అని అనేవారు. అప్పటివరకూ తనకు అభ్యర్ధిగా ఉన్నా హిల్లరీ క్లింటన్ కాస్త వెనుకబడే ఉండేది. అయితే రాను రాను ట్రంప్ కు వ్యతిరేకత పెరగడంతో కాస్త వెనక్కి తగ్గారు. ఇక ఎప్పుడైతే మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగిందో అప్పుటితో ట్రంప్ సత్తా తెలిసిపోయింది. ఈ డిబేట్ లో హిల్లరీ మంచి మార్కులు సంపాదించారు. అప్పుడు కూడా ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్ భర్త బిల్ క్లింటన్ పై ఆరోపణలు చేస్తూ.. తన కూతురు చూస్తుందని ఆయన రాచకార్యాలు చెప్పలేదు.. కానీ రెండో డిబేట్లో నా తడాఖా చూపిస్తా అంటూ చెప్పుకొచ్చారు. ఇంకే ముంది అప్పుడే ట్రంప్ గారి వీడియోలు బయటకు వచ్చాయి. ఒక మహిళతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇదే హిల్లరీకి ప్లస్ పాయింట్ అయింది. రెండో డిబేట్ లో ఆమె వీటిపైనే ట్రంప్ పై వివర్శలు చేసింది. ఇక రెండో డిబేట్ లో కూడా హిల్లరీ దే పైచేయి అయింది. అనంతరం చేసిన సర్వేల్లో కూడా ట్రంప్, హిల్లరీ కంటే కాస్త వెనుకబడే ఉన్నాడు.
ఇక ఇప్పుడు తాజాగా చూస్తే ఒకరు తరువాత ఒకరు మహిళలు వరుసపెట్టి ట్రంప్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యోగం కోసం వచ్చే అప్రెంటిస్‌లతో, ఒంటరిగా లిఫ్టులో దొరికే మహిళలతో, విమానంలో పక్క సీటులో కూర్చున్న మహిళలతో ట్రంప్ అసభ్యంగా ప్రవర్తించినట్టు మీడియా కథనాలు వివరిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు మరో నెలరోజుల్లో జరుగునున్న తరుణంలో ట్రంప్ వ్యక్తిత్వంపై వస్తున్న ఆరోపణలో నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ ఎన్నికల్లో గెలవడం కష్టమే అనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి తోడు సొంత పార్టీ నేతలతోనే ఆయనకు వైరం. ఇవన్నీ కలిసి.. ట్రంప్ గెలవడం కష్టమే అనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో ఎన్నికల వరకూ ఆగాల్సిందే.