డొనాల్డ్ ట్రంప్ కు ఓటు వేయకపోతే.. మోడల్ బంపరాఫర్..
posted on Aug 1, 2016 @ 10:26AM
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ అధ్యక్ష బరిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే డొనాల్డ్ ట్రంప్ కు, హిల్లరీ క్లింటన్ కు మధ్య జరగనుంది. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ మోడల్ ఒక బంపరాఫర్ ప్రకటించింది. ఇంతకీ ఏంటా ఆఫర్ అనుకుంటున్నారా..? జెస్సికా రాబిట్ అనే మోడల్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు కనుక ఓటు వేయలేదని స్యాక్ష్యం చూపితే తన నగ్న చిత్రాలను పంపుతానంటూ సంచలన ప్రకటన వెలువరించింది. ఇప్పటికే జెస్సికా రాబిట్ 'ట్రాంప్స్ అగనెస్ట్ ట్రంప్' పేరిట ప్రచారం నిర్వహిస్తుంది. అంతేకాదు ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. తనకు ట్రంప్ మద్దతుదారులతో సంబంధాలు ఉన్నాయని.. ఒక్కొక్కటీ నెమ్మదిగా బయటకు వస్తాయని వ్యాఖ్యానించింది. అయితే తనకు ఎంత వరకూ తెలుసో.. లేదో తెలియదు కానీ.. ఇది హిల్లరీ క్లింటక్ ను ప్లస్ పాయింటే అంటున్నారు కొంతమంది. చూద్దాం ఏం బయటపడతాయో..