అమ్మాయిలు పందులు.. అసహ్యకరమైన జంతువులు.. ట్రంప్
posted on Jul 18, 2016 @ 3:39PM
డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పని చెప్పి వివాదంలో కూరుకుపోయాడు. అసలే ఎప్పుడు చూసినా వివాదాస్ప వ్యాఖ్యలు చేసే ట్రంప్ ఈసారి ఏకంగా మహిళలపై తన నోరు పారేసుకున్నాడు. దీంతో మహిళలు నిరసనలు మొదలుపెట్టారు. అసలు సంగతేంటంటే.. జీఓపీ ప్రైమరీలో తనకు ప్రత్యర్థిగా నిలిచిన మహిళ కార్లీ ఫియొరినాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖం చూడండి.. ఆ ముఖం చూస్తే ఎవరైనా ఓటేస్తారా?.. అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యే ముఖమేనా అది..! అంటూ విమర్శించారు. అంతేనా తనను ప్రశ్నలడిన ఓ యాంకర్ ను సైతం ఆమె ఒక తెలివి తక్కువ దద్దమ్మ అంటూ.. అక్కడితో ఆగకుండా మహిళలపై ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేశాడు. మహిళలంటే నాకు మహిళలంటే నాకు అసహ్యం.. అందంగా లేనివారంటే మరింత అసహ్యం.. వారు లావుగా ఉండే పందులు.. అసహ్యకరమైన జంతువులు.. ఐ హేట్ విమన్.. అంటూ తన ఇష్టం వచ్చేసినట్టు వ్యాఖ్యానించాడు.
అంతే ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు మహిళలు ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను గౌరవించలేని వ్యక్తి అమెరికాకు అధ్యక్షుడు ఎలా అవుతాడు.. అంటూ మహిళలు నిరసన చేపట్టారు. అదీ కూడా దుస్తులిప్పి.. అర్ధనగ్నంగా రోడ్డుపై ట్రంప్‌కు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు ట్రంప్ వైట్‌హౌస్‌లో ప్రవేశించేందుకు అనర్హుడని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.