కరోనా వార్డ్ లో డాన్సులు..
posted on Apr 30, 2021 @ 3:25PM
సరిగ్గా సంవత్సరం కింద ప్రశాంతగా ఉంది ప్రపంచం. ఎక్కడి నుండి వచ్చిందో మాయదారి కరోనా ఒక్కసారి పెను ఉప్పెనలా ప్రపంచాన్ని కబళించింది. జీవం తో ఉన్న ప్రజా సముదాయాన్ని నిర్జీవులను చేసింది. ఒకటి కాదు రెండు కాదు కొన్నీ లక్షల మంది ప్రాణాలను తీసింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విధ్వంసం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా ఇండియాలో రోజుకు 3.5 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో, ఏ హాస్పిటల్ చూసినా కరోనా పేషెంట్లతో కిటకిటలాడుతుండు. దీంతో వైద్య సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా కరోనా కట్టడిలో ముందున్న వారంతా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్నారు. చాలా మంది హెల్త్ కేర్ వర్కర్లు 24 గంటలు హాస్పిటల్లోనే ఉండి సేవలందిస్తున్నారు. తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒత్తిడి పోగొట్టుకోవడానికి, పేషెంట్లలో మనో స్థైర్యాన్ని నింపేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దిసేపు రిలాక్స్ అయ్యేందుకు డ్యాన్స్ స్టెప్పులేస్తున్నారు. తాజాగా హెల్త్ వర్కర్లు పంజాబీ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. బహుశా మన ధైర్యానికి మించిన మెడిసిన్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేడకున్నారో ఏం కొత్తగా డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తారు.
కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్య సేవలు అందించే సిబ్బందికి సెలవులు కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వారు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఒత్తిడిని దూరం చేసేందుకు, పేషెంట్లలో ధైర్యాన్ని నిపేందుకు వైద్య సిబ్బంది డ్యాన్సులు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు కరోనా రోగుల్లో సానుకూల ఆలోచనలు నింపుతాయని వారు చెబుతున్నారు. తాజా వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతోంది. హెల్త్ వర్కర్లు చేసిన పనిని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.
సోషల్ మీడియాలో వైరల్..
వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే.. కరోనా సోకిన రోగులను ఉత్సాహపరిచేందుకు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు పీపీఈ కిట్లను ధరించి భాంగ్రా స్టెప్పులేయడం మనం చూడవచ్చు. వైద్యులు డాన్స్ చేస్తూనే.. రోగులను కూడా వారితో పాటు డాన్స్ చేయాలని ప్రోత్సహించారు. దీంతో కొంతమంది రోగులు బెడ్‌పైనే చిటికెలు, చప్పట్లు కొట్టడుతూ భాంగ్రా స్టెప్పులను అనుకరించారు. ఈ వీడియోను గుర్మీత్ చాధా అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్లేబ్యాక్ సింగర్, గేయ రచయిత షారీ మన్ పాడిన జిందగీ అనే పంజాబీ సాంగ్‌కు వారు డ్యాన్స్ చేశారని తెలిపారు. సోషల్ మీడియా యూజర్లు ఇంటర్నెట్లో ఈ వీడియోను చూసిన తరువాత వైద్యులను మరింతగా ఉత్సాహపరిచారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సానుకూల భావాలను పెంపొందిస్తున్న హెల్త్ వర్కర్లను ప్రశంసిస్తున్నారు.