ఎపిలో ఇద్దరు ఎమ్మెల్సీల పై అనర్హత వేటు
posted on Mar 12, 2024 @ 12:13PM
వైసీపీ అధినాయకత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. పార్టీ లైన్ దాటిన ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసింది. పార్టీ లైన్ దాటి పనిచేశారంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఆధారాలను కూడా సమర్పించింది. ఇక ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి. రామచంద్రయ్యలపై కూడా అనర్హత వేటు వేయాలని కూడా మండలి ఛైర్మన్ మోషెన్ రాజు కు ఫిర్యాదు చేసింది.వంశీకృష్ణ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి జనసేన పార్టీలో చేరగా, సి. రామచంద్రయ్య టీడీపీలో చేరడాన్ని సీరియస్ గా తీసుకుని చర్యలకు సిద్ధమయింది. అయితే వీరిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయగా స్పీకర్, మండలి ఛైర్మన్ విచక్షణపై ఆధారపడి ఉంది. అయితే మంగళవారం అనూహ్యంగా ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది.
ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. జనసేనలో చేరిన వంశీకృష్ణ, టీడీపీలో చేరిన సి.రామచంద్రయ్యలపై ఆయన చర్యలు తీసుకున్నారు. వీరిద్దరూ వైసీపీ తరపున ఎమ్మెల్సీలుగా గెలుపొందారు. అయితే ఇటీవల ఇద్దరూ వైసీపీకి గుడ్ బై చెప్పి పార్టీలు మారారు. దీంతో, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ శాసనమండలి ఛైర్మన్ కు, మండలి కార్యదర్శికి మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సమగ్ర విచారణ నిర్వహించిన అనంతరం ఇద్దరి సభ్యత్వాలపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు