చెన్నైపై ఇంకా మమకారం పోలేదు..ధోనీ
posted on Feb 16, 2016 @ 5:53PM
ఐపిఎల్ లో కొత్త టీం బాధ్యతలు స్వీకరించటం తనకు కూడా కొత్తగానే ఉందంటున్నాడు ధోనీ. ఎనిమిదేళ్ల పాటు ఒకే టీంలో ఉండి ఇప్పుడు మరో కొత్త టీం కు ఆడటం కాస్త డిఫరెంట్ గా ఉన్నా, ఇది కూడా నచ్చిందట. మరి చెన్నై సూపర్ కింగ్స్ ను మర్చిపోయారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ధోనీ ఎమోషనల్ అయ్యాడు. " మర్చిపోయాను అని చెప్తే అబద్ధమవుతుంది. అన్ని సంవత్సరాల పాటు ఆడిన కారణంగా, ఆ టీం తో ఎంతో కొంత మమకారం ఉంటుంది. ఐపిఎల్ ఆరంభమైనప్పటినుంచీ నేను అడుతున్న జట్టు చెన్నై. ఒక ప్రొఫెషనల్ ఆటగాడు వీటన్నిటికీ అతీతంగా ఉండాలి. నా మీద నమ్మకముంచినందుకు కొత్త జట్టు రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. " అన్నాడు.
పుణే జట్టుకు జెర్సీ ఆవిష్కరణ సమయంలో ఇలా తన మనసులోని మాటల్ని పంచుకున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో, ఐపిఎల్ నుంచి చెన్నై, రాజస్థాన్ జట్లను రెండేళ్ల పాటు సస్పెండ్ అవడంతో వాటి స్థానంలో రైనా కెప్టెన్ గా గుజరాత్ లయన్స్, ధోనీ కెప్టెన్ గా రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్ వచ్చిన సంగతి తెలిసిందే..ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకూ ఐపిఎల్, క్రికెట్ అభిమానుల్ని అలరించనుంది.