తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on Jul 30, 2025 9:04AM
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. పవిత్రమైన శ్రావణమాసం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. బుధవారం (జులై 30) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 18 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
కంపార్ట్ మెంట్లు, క్యూలైన్ లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అన్న ప్రసాదం, పాలు, జల ప్రసాదం అందజేస్తున్నది. ఇక మంగళవారం (జులై 29) శ్రీవారిని మొత్తం 75 వేల 183 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 906 మంది తలనీలలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 89 లక్షల రూపాయలు వచ్చింది.