తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on Jan 7, 2025 8:15AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (జనవరి 7) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 16 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక సోమవారం (జనవరి 6) శ్రీవారిని మొత్తం 54 వేల 180 మంది దర్శించుకున్నారు. వారిలో 17 వేల 689 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 20 లక్షల రూపాయలు వచ్చింది.