తిరుమలేశుని సర్వ దర్శనానికి 24 గంటలు
posted on Sep 15, 2024 @ 11:08AM
తిరుమలలో భక్తుల దర్దీ విపరీతంగా పెరిగింది. వరుస సెలవలు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. రెండో శనివారం, ఆదివారంతో పాటు సోమవారం, మంగళవారం కూడా సెలవలు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు పోటెత్తారు.
ఆదివారం (సెప్టెంబర్ 15) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ క్యూకాంప్లెక్స్ దాటి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక శనివారం (సెప్టెంబర్ 14) శ్రీవారిని మొత్తం 80 వేల 735 మంది దర్శించుకున్నారు. వారిలో 40 వేల 524 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 19 లక్షల రూపాయలు వచ్చింది.