తూర్పున ఉదయించేది రవే
posted on Jun 25, 2013 @ 4:39PM
విజయవాడ సాక్షిగా మరోసారి కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు తెరమీదకు వచ్చాయి.. ఎప్పుడు వర్గ పోరుతో సతమతమవుతున్న పార్టీని రాజశేఖర్‌రెడ్డి కాస్త కట్టిడి చేసిన ఆయన మరణం తరువాత పరిణామాలు మళ్లీ పరిస్థితిని మొదటికి తీసుకువచ్చాయి.. ముఖ్యంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తరువాత ఈ గొడవలు మరింత ఎక్కువయ్యాయి.
తాజాగా విజయవాడ తూర్పు అసెంబ్లీ సీటు విషయంలో కాంగ్రెస్ నేత నెహ్రూ, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రవి బహిరంగ విమర్షలు చేసుకుంటున్నారు.
ఈ విషయంలో రవి నెహ్రూపై ఆయనకు మద్దతు నిస్తున్న లగడపాటి రాజగోపాల్ పై విమర్షలు గుప్పించాడు.. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయినప్పుడు తనకు విజయవాడ తూర్పు సీటుకు అధిష్టానం హామి ఇచ్చిందని.. ఇప్పుడు నెహ్యూ ఎన్ని రాజకీయాలు చేసి వేస్ట్ అంటూ కార్యకర్తల సమావేశంలో ప్రకటించాడు.
అయితే ఇప్పటికే ఆ సీటు మీద ఆశతో అక్కడ తన ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న నెహ్రూ ఈ విషయంలో ఎలా స్పందిస్తాడో.. మరి ఈ గొడవను సద్దుమనిగించడానికి కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి రాయభారాలు నడిపిస్తారో చూడాలి..