ఖర్గే ని పిలిచి మూల కూర్చోబెట్టారు.. ఆగ్రహించిన కాంగ్రెస్
posted on Jul 25, 2022 @ 5:58PM
పెళ్లికి పిలిచినపుడు మర్యాదా పాడూ లేకపోతే ఎలా? పక్క ఊరు నుంచి వచ్చిన చిన్నబావ కంటే చాలా దూరం నుంచి వచ్చిన పెద్దబావగారిని పట్టించుకోవాలిగదా?.. ఈ వైరం ఓ పెళ్లి సందర్భంగా సదరు బావ గారి బంధువుకి, పెళ్లికూతురు తండ్రికీ మధ్య జరిగింది. చీటికీ మాటికీ గొడవచేస్తున్నామంటారేగాని ఆ మాత్రం ప్రాధాన్యతనివ్వకపోతే ఎలా చెప్పండి. తర్వాత సర్దుకుపోయారులేండి. ఇదుగో ఇదే కోపం మల్లి కార్జున ఖర్గే గారికీ వచ్చింది.
పార్లమెంటు హాలులో రాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి అందర్నీ ఆహ్వానించినట్టే ఖర్గేనీ ఆహ్వానించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా తనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వక పోవడం పట్ల ఆయనకు ఆగ్రహం వచ్చింది. వచ్చిందంటే రాదు మరీ.. ఆయన కు దక్కాల్సిన స్థానం దక్కకపోవడం అవమానించినట్టే కదా? అందుకే రాజ్యసభకు ఫిర్యాదుచేస్తూ పెద్ద ఉత్తరమే రాశారట.
ఖర్గేకు జరిగిన అవమానం అందరినీ అవమానించినట్టేనని భావించి ప్రతిపక్షాల నాయకులంతా సంత కాలు చేసిన ఉత్తరాన్ని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. ఖర్గే కు మర్యాద పూర్వ కంగా ఇవ్వాల్సిన సీటును ఆయనకు కేటాయించాలన్న కనీసపు ప్రోటోకాల్ పాటించకపోవడం అందరి ఆగ్రహానికీ కారణం. ఈ చిన్నపాటి విషయంలోకూడా ప్రభుత్వం ఏమాత్రం జాగ్రత్త తీసుకున్నట్టు లేదని, కావాలనే అవమానిం చాలనే ఈ విధంగా ఏర్పాట్లు చేశారన్న అభిప్రాయాలే వెల్లువెత్తుతు న్నాయి. రాష్ట్రపతి అభ్యర్ధి తమ వర్గంనుంచే పీఠం ఎక్కారు గనుక ఇక ప్రధాన ప్రతిపక్షానికి నిద్ర లేకుండా చేస్తామని చూచాయిగా హెచ్చరించడానికి ఇలా చేశారేమోనన్న అనుమానాలు వినవస్తున్నా యని రాజకీయ విశ్లేష కులు అంటున్నారు.
ఖర్గే మొదటి వరుసలోనే కూచున్నారు. కానీ పార్లమెంటు సెంట్రల్ హాలులో ఎడవేపు చిట్టచివార్న! బిజెపీ ఛీఫ్ జె.పి.నడ్డా, మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌లకు కాస్తంత ప్రాధాన్యతా స్థానాలే కల్పించారు. ఇదంతా రాజకీయ కుట్రేనని, ప్రధాన ప్రతిపక్షాన్ని కేంద్ర హోంశాఖ ఘోరంగా అవమా నిం చడమేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.