30 సార్లు పొడిచి పొడిచి చంపాడు..
posted on Sep 20, 2016 @ 3:06PM
దేశంలో ప్రేమోన్మాదుల దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిన్న మెదక్ జిల్లా సదాశివపేటలో ప్రేమను నిరాకరించిందని ఓ విద్యార్ధినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన మరచిపోకముందే దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. తనను ప్రేమించడం లేదనే అక్కసుతో ఓ టీచర్‌ను అత్యంత పాశవికంగా 30 సార్లు పొడిచి పొడిచి చంపాడు. ఉత్తర ఢిల్లీలో కరుణ అనే మహిళ టీచర్‌గా పనిచేస్తోంది...34 ఏళ్ల సురేందర్ అనే వ్యక్తి ఆమెను ప్రేమించమంటూ తరచూ వెంటాడి, వేధిస్తుండేవాడు. అయితే అతని ప్రేమను కరుణ కాదనడంతో కక్ష పెంచుకున్నాడు సురేందర్. ఈ నేపథ్యంలో ఇవాళ రోడ్డుపై వెళుతున్న కరుణను అందరూ చూస్తుండగానే పొడిచి పొడిచి చంపాడు. చనిపోయింది అని నిర్థారించుకున్న తర్వాత అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయాడు. అక్కడి సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కరుణని సురేందర్ సంవత్సరం నుంచి వేధిస్తున్నాడని..దీనిపై యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సమాచారం.
;