జలసర్పానికి 5000 మంది బలి
posted on Jun 24, 2013 @ 10:26AM
చార్‌దామ్ యాత్రలో విషాదాల పరంపర కొనసాగుతూనే ఉంది.. వరద తగ్గిన చోట్ల శవాలు గుట్టలుగా తేలుతున్నాయి.. కేదారేశ్వరుడి ఆళయంతో సహా ఆ ప్రాంతం అంతా స్మశానంలా కనిపిస్తుంది.. ఎక్కడ చూసిన మానవ మృతదేహాలు శిథిలాలతో భయకర పరిస్థితులు కొనసాగుతున్నాయి.. వీటికి తోడు ఇంకా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది..
సహాయక చర్యల్లో సైన్యం ఎంతగా శ్రమిస్తున్నా.. ప్రభుత్వ వైఫల్యాలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి.. ఇప్పటి వరకు మృతులు వందల్లోనే అంటూ అధికారులు ప్రకటిస్తూనా.. ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఈ సంఖ్య ఐదు వేలకు పైనే అంటున్నారు..
ఇదిలా ఉంటే ఇంకా 12వేల మందిపైగా యాత్రికలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నారు.. వారిని రక్షించటానికి సైన్యం తీవ్రంగా శ్రమిస్తుంది.. కాని అక్కడికి చేరుకోవటానికి సరైనా రవాణ వ్యవస్థ లేకపోవటం, హెలికాప్టర్లో చేరడానికి వాతావరణం సహకరించకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో యాత్రికుల్లో చాలా మంది ఆఖలిదప్పులతో అలమటిస్తున్నారు..