సిలబస్ నుంచి డార్విన్ పరిణామ సిద్ధాంతం తొలగింపు తగదు
posted on May 10, 2023 @ 4:36PM
పిల్లలలో తార్కిక ఆలోచనా విధానానికి, శాస్త్రీయ దృక్ఫధంలో నిర్ణయాలు తీసుకునే శక్తికీ తిలోదకాలిచ్చేసేలా ఎన్సీఈఆర్టీ నిర్ణయాలు ఉంటున్నాయని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠ్యాంశాల నుంచి డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడం అటువంటి నిర్ణయమేనని వారంటున్నారు. టెన్త్ క్లాస్ సిలబస్ నుంచి డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించాలని యిటీవల ఎన్సీఈఆర్టీ నిర్ణయించింది.
ఈ అంశంపై తాజాగా టాటా యిన్సిటిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వివిధ ఐఐటీలకు చెందిన 1800 మంది నిపుణులు రాసిన బహిరంగ లేఖలో జీవపరిణామ సిద్ధాంతాన్ని విస్మరిస్తే తదనంతర కాలంలో మనం దేన్నీ అర్థం చేసుకోలేమని అందులో పేర్కొన్నారు.
డార్విన్ సిద్ధాంతం సాయం లేకుండా చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని అధ్యయనం చేయడం కుదరదనీ, ప్రజల్లో విజ్ఞానం పెంపొందించాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఎన్సీఈఆర్టీ నిర్ణయం విరుద్ధమని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.
చరిత్రను.. భవిష్యత్తును అర్ధం చేసుకోవడానికి దోహదపడే సిద్దాంతాలను తొలగిస్తే.. భవిష్యత్ తరాలు దేన్నీ కూడా అర్థం చేసుకోలేమ పరిస్థితి ఎదురౌతుందనీ, రాబోయే తరంలో మూఢ నమ్మకాలు పెరుగుతాయని మేధావులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.