ఇది బ్లాక్ టీ కాదు, మధుమేహాన్ని తగ్గించే డార్క్ టీ..!!

నేటికాలంలో మారుతున్న జీవనశైలి, రోజువారీ ఆహారపు అలవాట్లు..ఇవన్నీ కూడా రకరకాల అనారోగ్య సమస్యలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మనలో చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇది వ్యాధి కానప్పటికీ...ఒకసారి సోకిదంటే తగ్గదు. దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం అసలైన చికిత్స. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణాలమీదకే వస్తుంది. ముఖ్యంగా సిటీ లైఫ్‌లో ఈ వ్యాధి చాలా త్వరగా వస్తోందని.. ఒక చాప్టర్ రిపోర్టు ప్రకారం ప్రతి పదిమందికి పరీక్షలు చేస్తే కనీసం ఐదారుగురికి మధుమేహం నిర్దారణ అవుతుంది. నిపుణులు అభిప్రాయం ప్రకారం.. జీవనశైలిలో మార్పులు, సరైన ఆహారాన్ని తీసుకుంటే.. ఈ వ్యాధిని నయం చేయవచ్చు. మధుమేహాన్ని నియంత్రించడంతో డార్క్ ప్రయోజనాలేంటో చూద్దాం.

డార్క్ టీ గురించి:

డార్క్ టీ అనేది..ఇది సూక్ష్మజీవుల కిణ్వ ప్రక్రియ ప్రక్రియకు గురైనప్పుడు.. పూర్తిగా ఆక్సీకరణం చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ టీ ఆకులు ఆక్సీకరణ ప్రక్రియకు గురై రంగు మారుతాయి.ఇది చైనాలో ఒక సాధారణ టీ. అక్కడి ప్రజలు దీన్ని నిత్యం తాగుతుంటారు. బ్లాక్ టీతో పోలిస్తే డార్క్ టీ భిన్నంగా ఉంటుంది. బ్లాక్ టీ అధిక ఆక్సీకరణ ప్రక్రియకు లోనవుతుంది. అదే గ్రీన్ టీలో ఆక్సీకరణ ప్రక్రియ జరగదు.

డార్క్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

టీ తాగని వారితో పోలిస్తే డార్క్ టీ తాగేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 53% తక్కువగా ఉంటుందని.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 47% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఈ సందర్భంలో వారి వయస్సు, లింగం, వారి శరీర నిర్మాణం,  వారు నివసించే ప్రాంతం పరిగణనలోకి తీసుకుంటారని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ టీని తయారుచేసేటప్పుడు ఇందులో చక్కెరను ఉపయోగించకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ అధ్యయనంలో సుమారు 2,000 మందిని ఉపయోగించారు. వారిలో 400 మందికి డయాబెటిస్ ఉంది. 350 మందికి మధుమేహం వచ్చే అవకాశం ఉంది.మిగిలిన వారిలో సాధారణ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఉన్నాయి. వారిలో చాలా మంది టీ తాగలేదు. మరికొందరు ప్రతిరోజూ ఒకే రకమైన టీ తాగారు. పరిశోధకులు వారు ఎంత టీ తాగారు..వారి మూత్రంలో ఎంత గ్లూకోజ్ విసర్జించారో పరీక్షించడానికి వాటిని ఉపయోగించారు. రెండు కారణాల వల్ల డార్క్ టీ తీసుకోవడం వల్ల మధుమేహం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మొదటిది, ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచడంతోపాటు..రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నిర్వహించడంలో సహాయపడుతుంది. రెండవది, పెద్ద మొత్తంలో గ్లూకోజ్ మూత్రంలో విసర్జించబడుతుంది. దీని వల్ల శరీరంలో నియంత్రణలో ఉండాల్సిన గ్లూకోజ్ తగ్గిస్తుంది.

అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తినడం వల్ల మధుమేహం మరింత ఉధృతం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే అధిక కొవ్వు పదార్ధాలు, చక్కెర, ఉప్పు పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. దీని వలన శరీరం మంటగా మారుతుంది. అందువల్ల కూరగాయలు, పండ్లతో కూడిన సహజమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.


శరీరంలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండాలి. డీహైడ్రేషన్‌ను నివారించడానికి పుష్కలంగా నీరు తాగడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని అధ్యయనం నివేదించింది.