మళ్లీ తెరపైకి దానం... కాంగ్రెస్ లోనే
posted on Oct 18, 2016 @ 2:50PM
తెలంగాణ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ గతంలో పార్టీ మార్పుపై పలు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న దానం మరోసారి తెరపైకి వచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, ఆ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. వైఫల్యాలను ఎండగట్టేందుకు త్వరలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇవ్వాలనే సంయమనం పాటిస్తున్నామని దానం వ్యాఖ్యానించారు. తనకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదని, అందుకే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని ఆయన చెప్పుకొచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ దానం నాగేందర్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.