దున్నేవాడిదే భూమి....పండించేవాడే ఆసామి
posted on Jun 26, 2012 @ 4:15PM
ప్రత్యేక సెజ్‌ల పేరుతో వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో పారిశ్రామిక వేత్తలకు లక్షలాది ఏకరాల భూములు దోచి పెట్టారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కొందరు పారిశ్రామిక వేత్తలు చేశారు. కడుపు మండి అవకాశం కోసం ఎదురు చూస్తున్న రైతులు ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. తమనుంచి అక్రమంగా పొందిన భూములను తిరిగి స్వాధీన పర్చుకుంటున్నారు.
ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని పెదగంజాం గ్రామంలోని దళితులంతా ఐదుఎకరాల స్థలంలో ఉన్న చెత్తను తగులబెట్టి సేద్యానికి అనుగుణంగా మార్చారు. వాన్‌పిక్ కంపెనీ తమ భూములను లాక్కుందని బడా కంపెనీలకు తమ భూములను ధారాదత్తం చేసేదిలేదని తేల్చిచెప్పారు. వర్షాలుపడుతున్న తరుణంలోనే వరి విత్తనాలను జల్లి సాగుచేస్తామని చెప్పారు. ఈ ఐదు ఎకరాల భూమిని పదిమంది పది ముక్కలుగా చేసుకున్నారు. ప్రభుత్వం వాన్‌పిక్ ఒప్పందాన్ని రద్దుచేసి తమ భూమిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు, కారిడార్‌లు, అభివృద్ది పేరుతో పేదలను కొట్టి బడా కంపెనీలకు భూములను అప్పగించే సంసృతిని విడనాడాలన్నారు. అయితే ఈ మద్యనే మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇదే భూముల్లో ఏరువాక కార్వక్రమం చేపట్టటం కొసమెరుపు.